Business Idea : కేవలం రూ. 5 వేలు పెట్టుబడితే ఈ వ్యాపారం స్టాట్‌ చేయొచ్చు.. లాభం లక్షల్లోనే..!

-

Business Idea : జాబ్‌ నిమిత్తం మనం ఎక్కడెక్కడో ఉంటాం.. పండుగలకు, సెలవులకు ఊరికి వెళ్తే ఇంట్లో వాళ్లు మొదట అనేమాట.. ఏంటి నాన్న తగ్గిపోయావు, ఫుడ్‌ సరిగ్గా ఉండటం లేదా అని..! అవును ఎంత కాస్‌ట్లీ ఫుడ్‌ అయినా.. ఇంట్లో చేసినంత రుచిగా, క్వాలిటీగా ఉండదు. అందరూ ఇంటి ఫుడ్‌ను మిస్‌ అవుతుంటారు. ఈ సమస్యే మనకు వ్యాపారం పెట్టేదానికి మంచి పునాది. మీరు ఇంటి భోజనంతో మెస్‌ సర్వీస్‌ స్టార్ట్‌ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. పైగా గిరాకీ కూడా బాగుంటుంది. కేవలం 5 వేలు పెట్టుబడితే మీరు ఈ వ్యాపారాన్ని స్టాట్‌ చేయోచ్చు.

Business Idea
Business Idea

టిఫిన్‌ లేదా మెస్ సర్వీస్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి సైజ్‌తో సంబంధం లేకుండా ముఖ్య అంశాలను అర్థం చేసుకోండి. లొకేషన్, ఇతర టిఫిన్, మెస్ సెంటర్ల నుంచి పోటీ, వాటి మెనూలు వంటి అనేక ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రారంభంలో సొంత వంటగది నుంచి చేయొచ్చు. ముందు మార్కెట్ రిసెర్చ్ చేయాలి. పోటీ మెస్‌, టిఫిన్ సెంటర్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి, సర్వీస్, ఐటెమ్స్ ఎలా ఉన్నాయో చూడాలి.

మార్కెటింగ్ : బిజినెస్ స్టార్ట్ చేసి.. మీ మెస్/టిఫిన్ సెంటర్ గురించి ప్రచారం చేయాలి. వ్యాపారానికి విజిబిలిటీ, ఎఫెక్టివ్‌ ప్రమోషన్‌ అనేది చాలా అవసరం. విజిటింగ్ కార్డ్‌లు, పాంప్లేట్స్, గూగుల్, హోర్డింగ్‌లు, డిజిటల్ మార్కెటింగ్ వంటి పద్ధతుల ద్వారా కూడా ప్రచారం చేయవచ్చు. మార్కెటింగ్‌కు సమయం పడుతుంది, కానీ కస్టమర్‌లను ఆకర్షించడానికి ఇది చాలా అవసరం. మీ దగ్గర ఉన్న డబ్బుకు తగ్గట్టుగా ప్రచార మార్గాన్ని ఎంచుకోవచ్చు.

ఈ బిజినెస్‌లో ఖర్చులను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. సాధారణంగా మీల్స్‌లో పప్పు, కూర, అన్నం, చపాతీలు, సలాడ్ లేదా రైతా ఉంటాయి. ఇంటి నుంచి టిఫిన్ సర్వీస్‌ ప్రారంభించాలంటే దాదాపు రూ.5000 నుంచి రూ.10,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఫిజికల్ షాప్‌ను సెటప్ చేస్తుంటే, అద్దె సహా పెట్టుబడి రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఉండవచ్చు. పెద్ద స్థాయి ఆపరేషన్ కోసం దాదాపు రూ.50,000 అవసరం కావచ్చు. తెలివిగా నిర్వహిస్తే, తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఈ వ్యాపారం అధిక లాభాలను అందిస్తుంది. ఇంటి నుంచి సులువుగా సంపాదించడానికి మార్గం చూపుతుంది.

రెసిడెన్షియల్ సొసైటీ నుంచి టిఫిన్ సర్వీస్‌ నిర్వహించాలని ప్లాన్ చేస్తే, చట్టపరమైన సమస్యలను ఎదుర్కోకుండా సొసైటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవాలి. వ్యాపారంలో ఫైర్‌కి సంబంధించిన అంశాలతో సంబంధం ఉంటే, అగ్నిమాపక శాఖ నుంచి ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్ని రకాల వ్యాపారాల కోసం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి.

ఆహారం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఆహారం, పానీయాల వ్యాపారాలకు FSSAI లైసెన్స్ తప్పనిసరి. వార్షిక ఆదాయం రూ.12 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఇది అవసరం. వ్యాపారం కోసం ఫిజికల్‌ షాన్‌ని ఉపయోగిస్తుంటే షాప్ యాక్ట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news