బిజినెస్ ఐడియా:రూ.2 లక్షల పెట్టుబడితో.. నెలకు రూ.లక్ష పొందే సూపర్ బిజినెస్..

-

బిజినెస్ అనేది ఈరోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది.ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు..అలాంటి వారి కోసం చక్కటి బిజినెస్ ఐడియా ఉంది.. అదే గోధుమ రవ్వ తయారి..శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు , కొంత మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. మొత్తం మీద, పోషకాలు , సులభంగా జీర్ణమయ్యే లక్షణాలు ఉన్నాయి.

గోధుమరవ్వకు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే రోజురోజుకూ మరింత పెరుగుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుందని నిరూపించవచ్చు… గోధుమ రవ్వ తయారు చేయడానికి, మొదట గోధుమలను పూర్తిగా శుభ్రం చేయాలి. అందులో రాళ్లు, ఇసుక వంటివి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మెషీన్ సహాయంతో బరకగా ఉండేలా, రవ్వ తయారు చేచేసుకోవచ్చు..ఖాదీ , విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రధాన మంత్రి గ్రామోద్యోగ్ రోజ్‌గార్ యోజన కింద గోధుమ రవ్వ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది. ప్రాజెక్టు నివేదిక ప్రకారం తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.2.40 లక్షలు ఖర్చవుతుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద నిధులు లేకుంటే, మీరు PM ముద్రా యోజన ద్వారా లోన్ తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా, మీరు బ్యాంకు నుండి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..

ముందుగా 500 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్ నిర్మాణానికి మొత్తం రూ.లక్ష అవుతుంది. అదే సమయంలో, పరికరాల కోసం 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తారు. అలాగే రూ.40,000 వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. ఆ విధంగా మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,40,000 లక్షలకు చేరుకుంది…ఒక కిలో గోధుమ రవ్వ ప్యాకేజింగ్ చేయడం ద్వారా సుమారు రూ. 50కు విక్రయించవచ్చు. సూపర్ మార్కెట్లలో వీటికి మంచి డిమాండ్ ఉంది. సంవత్సరానికి దాదాపు రూ. 30 లక్షల వరకూ సంపాదించవ్చు. అన్ని ఖర్చులు పోను కనీసం రూ. 10 లక్షల దాకా మిగిలే చాన్స్ ఉంది…మీకు కూడా ఈ బిజినెస్ చేసే ఆలోచన ఉంటే మొదలు పెట్టండి..

Read more RELATED
Recommended to you

Latest news