జీరో బడ్జెట్ లేదా ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి..?, కేంద్రం ఎందుకు ప్రోత్సహిస్తోంది..?

మళ్లీ మన మూలాలకి వెళ్దాము అంటూ దేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి మనకు తెలుసు. అయితే ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం కూడా జరిగింది. పైగా జీరో బడ్జెట్ వ్యవసాయం పై దృష్టి సారించాలని అన్నదాతలు కూడా సూచించారు. అయితే అసలు ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఏమిటి…? దీనిని ఎలా చేస్తారు ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తి చూసేయండి.

జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అంటే ఏమిటి…?

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందడం. అయితే ఈ క్రమంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తూ రసాయనాలు, పురుగు మందులు లేకుండా సాగు చేయడం.. అలానే అంతర పంటలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పంట ద్వారా సంపాదించవచ్చు. అంతేకాకుండా ప్రధాన పంట నుంచి అత్యధిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వ్యర్ధాలను కూడా ఉపయోగించుకొని పంటల నుండి మంచిగా రాబడి పొందొచ్చు.

ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఈ వ్యవసాయం జోరుగా సాగుతోంది. అలా పండించిన ఉత్పత్తులను మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో అమ్ముతున్నారు. ఇది ప్రజా ఆరోగ్యానికి చాలా మంచిది. జీరో బడ్జెట్ సేంద్రియ వ్యవసాయం ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన అజెండాలో చేరింది. దీని కారణంగా ఎరువులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.

ఈ కార్యక్రమాన్ని మరింత మంది రైతులకు చూపించడానికి బీజేపీ పాలిత ప్రభుత్వాలన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సహజ వ్యవసాయం పై ప్రధాని మోడీ ని వినాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు పిలుపునిచ్చింది. అయితే పూర్వ కాలంలో ఈ పద్ధతుల్లో అనుసరించేవారు.

స్వాతంత్రానంతరం ఎరువులు పురుగు మందులు లేకుండా హరిత విప్లవం తర్వాత ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని రేసు ఆహారాన్ని విషపూరితం చేసింది. అయితే అలా కాకుండా తిరిగి మళ్ళీ మనం సేంద్రియ పద్ధతుల్లో పాటించాలని తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై శ్రద్ధ చూపించింది. అలానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతులు అనుసరించడం మొదలు పెట్టారు.