హ్యాపీ బర్త్ డే అప్పా… నువ్వే నా ఇన్సిపిరేషన్, నువ్వే నా మెంటర్

-

ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న జరిగిన చిరంజీవి బర్త్ డే వేడుకల్లో చిరు తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

నువ్వే నాకు ఇన్సిపిరేషన్, నువ్వే నా మెంటర్. నువ్వు నాకు గైడ్. నాకే కాదు లక్షల మందికి నువ్వే ఆదర్శం. వాళ్లంతా నిన్ను మెగాస్టార్ అని పిలుస్తారు. నేను మాత్రం నిన్ను అప్ప అని పిలుస్తాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు అప్పా. మా అందరిలో ఇలాగే ఎప్పుడూ స్ఫూర్తిని నింపాలని మనసారా కోరుకుంటున్నా. లవ్ యూ … అంటూ రామ్ చరణ్.. తన నాన్న, మెగాస్టార్ చిరంజీవికి వినూత్నంగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న జరిగిన చిరంజీవి బర్త్ డే వేడుకల్లో చిరు తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఒక సినిమా నటుడిగానే కాకుండా ప్రజా సేవకుడిగా మెగాస్టార్ అందరికీ సుపరిచితులు. ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కూడా స్థాపించారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని స్థాపించారు. కానీ.. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

2015లో మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తన నటన, ఈజ్ ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమాతో నిరూపించారు మెగాస్టార్. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీబిజీగా ఉన్నారు చిరు. తన కొడుకు, స్టార్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహరెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్టర్. పలువురు స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news