అఖిల్ అందరికీ హీరో.. నాకు మాత్రం కాదు : ఆమనీ

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జున హీరోగా యంగ్ హీరో అఖిల్ బాలనటుడిగా నటించిన చిత్రం సిసింద్రీ ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఇదే రోజున సెప్టెంబర్ 14న పాతికేళ్ల క్రితం సిసింద్రీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అఖిల్ కు అమ్మ పాత్ర చేసిన ఆమని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

సినిమాలో నాగార్జున అడిగిన వెంటనే అఖిల్ కు అమ్మగా చేయడానికి ఒప్పుకున్నానని.. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని.. తెలిపింది ఆమని. అయితే ఇప్పటికి కూడా అఖిల్ తనను అమ్మ అని హత్తుకుంటాడు అన్న విషయాన్ని ఆమని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తలచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని… అఖిల్ ను చూసినప్పుడు చిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేదో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది అంటూ ఆమని చెప్పుకొచ్చింది.