టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొడుకు గౌతమ్, కూతురు సితారకే సవాల్ విసిరాడు. ఇంతకీ ఏం సవాల్ విసిరాడు? అసలు గౌతమ్, సితారకు ఆయన సవాల్ విసరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటూ మీ యక్ష ప్రశ్నలతో విసిగించకండి. అసలు ఏం జరిగిందో చదవండి ముందు..
తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రలో బ్రహ్మాండగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. హరితహారంలో భాగంగా గ్రీన్ చాలెంజ్ అంటూ ఓ చాలెంజ్ ఆ మధ్య ప్రారంభమైంది. దాన్ని ఓ ఎన్జీవో ప్రారంభించింది. గ్రీన్ చాలెంజ్ ఏంటంటే.. మొక్కలు నాటడం.. ఓ ముగ్గురితో నాటించడం అన్నమాట.
అలా.. మంత్రి కేటీఆర్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సవాల్ విసిరారు. దీంతో ఆయన తన కుమార్తెతో కలిసి మొక్కను నాటి ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అనంతరం తన కూతురు సితార, కొడుకు గౌతమ్, దర్శకుడు వంశీ పైడిపల్లికి సవాల్ విసిరాడు. అంటే వాళ్లు కూడా మొక్కలు నాటి.. మరో ముగ్గురికి సవాల్ విసరాలన్నమాట. అలా తన కొడుకు, కూతురుకే సవాల్ విసరాల్సొచ్చింది మహేశ్ బాబుకు. అర్థమయిందా ఇప్పుడన్నా?
Challenge accepted, @KTRTRS & @RachakondaCop ? Thank you for nominating me…? #HarithaHaram is a great initiative taken towards a go green environment. I now nominate my daughter Sitara, my son Gautam and my @directorvamshi to take on the challenge. pic.twitter.com/SEhcuM4Dgy
— Mahesh Babu (@urstrulyMahesh) July 30, 2018