థమన్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్…..!!

-

రవితేజ నటించిన కిక్ సినిమాతో మంచి పేరు సంపాదించిన యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగాడు. అయితే మధ్యలో కొన్ని హిట్స్ తో ఫ్లాప్స్ కూడా ఎదుర్కొన్నాడు థమన్. అంతేకాక అప్పట్లో థమన్ పై కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. దానితో తన కెరీర్ పరంగా కొంత విరామం తీసుకున్న థమన్, ఇటీవల వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కిన తొలిప్రేమ సినిమాతో మళ్ళి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాతో పాటు సాంగ్స్ కూడా అప్పట్లో పెద్ద సక్సెస్ అయ్యాయి. ఆ తరువాత నుండి మళ్ళి అవకాశాలు అందుకున్న థమన్, ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన సాంగ్స్ అందించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది.

కాగా నిన్న విశాఖపట్నంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ కార్యక్రమంలో థమన్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ గారితో పని చేయాలనేది తన చిరకాల వాంఛ అని, అయితే ఎట్టకేలకు అది అరవింద సమేత మూవీతో తీరడం, అలానే ఆ సినిమా హిట్ అయి అందులోని సాంగ్స్ కూడా మంచి పేరు దక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇక ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో సాంగ్స్ కు ప్రేక్షకులు అందించిన రెస్పాన్స్ ఎప్పటికీ మరువలేనని, సినిమా మంచి సక్సెస్ సాధించి ముందుకు సాగడం మరింత ఆనందాన్నిచ్చిందని థమన్ చెప్పడం జరిగింది. అయితే మధ్యలో థమన్ మాట్లాడుతూ, నిజ‌మైన మాట‌లే మాట్లాడ‌మంది, నిజ‌మైన‌ క‌ల‌క్ష‌న్లే చెప్ప‌మంది. ఈరోజు చెప్పాం, గెలిచాం, కొట్టాం అంటూ వ్యాఖ్యానించాడు.

 

ఇపుడు థమన్ చేసిన ఇవే వ్యాఖ్యలపై మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమ హీరో నటించిన సరిలేరు సినిమాని కించపరిచే విధంగా ఉన్నాయని, నిజానికి అల సినిమాతో పాటు సరిలేరు కూడా మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న విషయం అందరికీ తెలుసునని, అయితే థమన్ మాత్రం తమ సినిమావే నిజమైన కలెక్షన్స్ అని అన్నాడంటే, మా హీరోవి ఫేకా అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే కొద్దిరోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో మహేష్, బన్నీ ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతుండగా, థమన్ చేసిన ఈ వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసినట్లైందని అంటున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news