Gabbar Singh: పవన్ కల్యాణ్ నరం నైలాన్ స్ట్రింగ్..సినిమా వచ్చి పదేళ్లైనా ‘గబ్బర్ సింగ్’ క్రేజ్ తగ్గలే

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గబ్బర్ సింగ్’ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఫ్లాప్స్ లోనే ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ సినిమా సక్సెస్ ఇవ్వడమే కాదు..అభిమానులు తలెత్తుకుని గర్వపడేలా చేసింది.

పవన్ కల్యాణ్ వీరాభిమాని హరీ శ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘దబాంగ్’కు రీమేక్. అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్లు బోలెడన్ని మార్పులు చేశారు దర్శకుడు హరీశ్ శంకర్.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది. కాగా, ఈ చిత్రం విడుదలై ఈ రోజుకు పదేళ్లయింది. 11 మే 2012న ఈ సినిమా విడుదలైంది.ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అభిమానులు సందడి చేస్తున్నారు. #DecadeForGabbarSingh డికేడ్ ఫర్ గబ్బర్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ పోస్టర్స్ షేర్ చేస్తున్నారు.

జనసేనాని అశేష అభిమానులు హ్యాపీగా ఎంజాయ్ చేసేలా చక్కటి చిత్రాన్ని అందించిన హరీశ్ శంకర్ కు నెటిజన్లు, పవన్ కల్యాణ్ అభిమానులూ థాంక్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ రచించిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి..అలనాటి పాట సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు తొలిసారి దేవి శ్రీప్రసాద్ ట్యూన్ వినిపించినపుడు ‘‘వీడి నరం నైలాన్ స్ట్రింగ్’’ అనే లైన్ వచ్చిందని తెలిపాడు. బండ్ల గణేశ్ ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్ అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాసింది.

Read more RELATED
Recommended to you

Latest news