ఇన్స్టాలో 21 మిలియన్ల ఫాలోవర్స్.. కానీ ఐకాన్ స్టార్ ఒక్కరికే ఫ్యాన్.. ఎవరికంటే!

-

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూత్ లో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తన స్టైలిష్ లుక్స్, డాన్స్ తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న బన్నీ సోషల్ మీడియాలో సైతం కోట్లలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా అల్లు అర్జున్ మాత్రం ఇన్స్టాలో ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ లో 21 మిలియన్స్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. దాదాపు టాలీవుడ్ లో ఇంతటి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ఇన్స్టాల్ ఒక్కరనే ఫాలో అవుతున్నారు. ఇంకా ఎవరిని ఫాలో చేయడం లేదు. ఆ ఒక్కరు ఎవరంటే బన్నీ సతీమణి స్నేహ రెడ్డి.

Allu Arjun romantic hug to Cutieee Sneha

అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకున్న అనంతరం స్నేహ రెడ్డి సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ లో వీరొకరు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్నారు. పిల్లలకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం షేర్ చేసుకుంటూ వస్తున్నారు. కాగా స్నేహ రెడ్డికి సైతం ఇన్స్టాలో 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే విడుదలై అందరినీ అలరించింది. కాగా ఈ సినిమా సైతం మంచి విజయాన్ని సాధిస్తుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news