ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే విద్యార్థుల టెన్షన్ కు తెర దించుతూ పరీక్షా ఫలితాలను విడుదల చేసే తేదీ మరియు సమయాన్ని ప్రకటించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలియచేశారు. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ పరీక్షకు మొత్తం విద్యార్థులు 4 .84 లక్షల మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం 5 .19 లక్షల మంది హాజరు అయ్యారు. మరి ఎంతమంది ఉత్తీర్ణులు కానున్నారు అన్న విషయం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
బ్రేకింగ్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపే !
-