అరవింద సమేతలో బిగ్ బి..?

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఇయర్ రాబోతున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అరవింద సమేతపై అంచనాలు భారీగా ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారట.

చిత్రయూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం సినిమాలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నాడట. ఎన్.టి.ఆర్ అరవింద సమేతలో అమితాబ్ అఫిషియల్ గా చెప్పకున్నా సినిమాలో బిగ్ బీ ఉంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం అమితాబ్ మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాలో గురువుగా నటిస్తున్నారు. ఈమధ్య దక్షిణాది సినిమాల మీద అమితాబ్ ఫోకస్ పెట్టారు.

ఈమధ్యనే ఓ తమిళ సినిమాకు సైన్ చేసిన అమితాబ్ సైరాతో పాటుగా అరవింద సమేత సినిమాలో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ న్యూస్ పై అఫిషియల్ కన్ ఫర్మేషన్ కొద్దిరోజుల తర్వాత తెలుస్తుంది. అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్న అరవింద సమేత సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news