బాలయ్య అభిమానులకు అదిరిపోయే డబుల్ ట్రీట్..!

ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు సపరేటుగా అభిమానులు ఉంటారు. వాళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే వసూళ్ల ప్రకంపనలు మొదలవుతాయని అందరూ భావిస్తారు. అలాంటి కాంబినేషన్స్ లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్ళ కలయికలో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా సంచలనం సృష్టించాయి. బాలయ్యకు కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్లు తెచ్చి పెట్టిన చిత్రాలు కూడా ఇవే కావడం గమనార్హం. గత 15 ఏళ్లలో బాలయ్య నటించిన సినిమాలలో కేవలం ఐదు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సాధించాయి. అందులో మూడు సినిమాలు బోయపాటి దర్శకత్వం వహించినవే.

అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ కి అభిమానులలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే సింహ, లెజెండ్ ,అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత వీళ్ళ కలయికలో నాలుగో సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమాను చాలా గ్రాండ్ గా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో ఒక సినిమా చేస్తున్నాడు. మరోపక్క బాలయ్య, అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన బాలయ్య పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఇక సినిమా కూడా జూన్ నెలాఖరుకల్లా పూర్తి కానుంది..

ఇకపోతే ఇద్దరూ తమ తమ సినిమాలను పూర్తి చేసుకున్న వెంటనే ఈ కాంబోలో సినిమా మొదలు కాబోతోంది. అయితే నిర్మాత ఎవరు అనేది క్లారిటీ లేదు. ఇకపోతే బోయపాటికి అత్యంత సన్నిహితుడైన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తాడు అనే టాక్ కూడా నడుస్తోంది. ఒకవైపు బాలయ్యతో ఇంకో సినిమా చేయాలని మైత్రి నిర్మాతలు కూడా ఆశపడుతున్నారు. ఇకపోతే గతంలో బాలయ్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సితార సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ ఎవరు చేతుల్లోకి తీసుకుంటారో చూడాలి.