సినీ ఇండస్ట్రీలో ఈమధ్య హీరోయిన్లు సహజీవనం, డేటింగు, గర్భం అంటూ పెళ్లికి ముందే తల్లులు అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ ఇలియానా కూడా పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అతడు ఎవరో చెప్పకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు అలా వివాహానికి ముందే గర్భం దాల్చి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం వివాహానికి ముందే గర్భం దాల్చి ఆ తరువాత పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె వివాహానికి దూరంగానే ఉంది. ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చిన ఆమె తల్లి కాబోతున్నానంటూ ప్రకటించి అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఆమె ఎవరో కాదు గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్.. అక్కినేని అందగాడు నాగార్జున , కార్తీ, తమన్నా , అనుష్క, శ్రీయ కలిసి నటించిన చిత్రం ఊపిరి. ఈ సినిమాలో నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. సౌత్ ఆఫ్రికా కు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా కెరియర్ ను మొదలుపెట్టి పలు సినిమాలలో నటించింది కూడా.. ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తో గాబ్రియెల్లా గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. ఇప్పటికే ఈ జంటకు ఒక కొడుకు కూడా జన్మించారు. కానీ వీరు మాత్రం వివాహం చేసుకోలేదు.
ఇప్పుడు మళ్లీ ఆమె గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది . బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. యోగా డే సందర్భంగా బేబీ బంప్ తో యోగాసనాలు వేసిన ఈమె.. ఆ ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మొత్తానికైతే పెళ్లి కాకుండానే మళ్లీ గర్భం దాల్చడంతో ఆమెపై నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram