ఆచార్య నుంచి కాజల్ ను తొలగించడంపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ

-

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ ఆచార్య’. దాాదాపు రెండేళ్ల గ్యాప్ తరువత మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా  ‘ఆచార్య’ థియేటర్లలోకి రాబోతోంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలక రోల్ లో కనిపించడనున్నారు. సిద్ధగా రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇలా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటుడటం మెగా అభిమానులకు పండగే. వరసగా హిట్లు ఇస్తున్న డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో… సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మణిశర్మ అందించిన మ్యూజిక్ కు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి కాజల్ ను తొలగించడంపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం చిరుకు జోడిగా కాజల్ ను ఎంపిక చేశారు. 4 రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ పెడితే బాగుండదనే ఉద్దేశంతో కాజల్ ను తొలగించినట్లు వెల్లడించారు. ఇంత చిన్న పాత్రకు అంతపెద్ద హీరోయిన్ చేయడం కూడా బాగుండదని కాజల్ కు చెప్పానని.. అందుకు ఆమె అర్థం చేసుకుని ఒప్పుకుని సినిమా నుంచి తప్పుకుందని కొరటాల శివ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news