శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, చమురు కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.దీంతో గత కొన్ని వారాలుగా ఆ దేశంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.దీనిలో భాగంగా ఆదివారం విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.రాజపక్సే నివసించే ఇంటి కాంపౌండ్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు కొంతమంది విద్యార్థి నాయకులు.ఫెన్సింగ్ దాటుకుని కాంపౌండ్ లోనికి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.కొలంబోలో పలు చోట్ల భారీకేడ్లు ఏర్పాటుు చేసి ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అయితే విద్యార్థులు భారీకేడ్లను తొలగిస్తుండగా పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు.దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
“మీరు రోడ్లు బ్లాక్ చేసి మరీ మమల్నిని ఆపగలరేమో…కానీ, ఈ ప్రభుత్వం మొత్తం ఇంటికి వెళ్లే వరకు మా ఉద్యమాన్ని మాత్రం ఆపలేరు” అని విద్యార్థి నాయకులు అన్నారు. ” గో హోమ్ గోట” అని ఫ్లకార్డులు పట్టుకుని అధ్యక్షుడు గుటబయ రాజపక్స కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాగా విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్న సమయంలో ప్రధాని మహీంద ఇంట్లో లేడు అని తెలియడంతో వాళ్లు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.