Acharya: ఓటీటీలో మెగాస్టార్ ‘ఆచార్య’..రిలీజ్ డేట్ ఫిక్స్?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం గత నెల 29న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. అయితే, ఈ సినిమా వసూళ్ల పర్వంగా దూసుకుపోతున్నది. కానీ, సినిమా అనుకున్న స్థాయిలో లేదని టాక్ అయితే వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. చిరకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. కానీ, ఆమె సీన్స్ తొలగించారు మేకర్స్. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ‘ఆచార్య’ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. ఈ పిక్చర్ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో రిలీజ్ చేసే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై మేకర్స్ ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీ తనయులు మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. పిక్చర్ లో తండ్రీ కొడుకుల అభినయంతో పాటు సాంగ్ కు గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ధర్మస్థలి, పాదఘట్టం నేపథ్యంతో పాటు నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో మూవీ స్టోరి ఉండగా, పిక్చర్ భారీ అంచనాల నడుమ విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news