‘డోంట్‌ టచ్‌’ అంటూ ఆ హీరోయిన్​ నాపై అరిచింది : నటుడు అజయ్‌

-

టాలీవుడ్ నటుడు అజయ్ అంటే గుర్తు పడతారో లేదో కానీ టిట్లా అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. దాదాపు 20 ఏళ్ల నుంచి అజయ్ టాలీవుడ్​లో నటిస్తున్నాడు. విలన్​గా, క్యారెక్టర్​ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలు పెట్టి హీరోగా కూడా నటించాడు. అయితే తాజాగా ఆయన చక్రవ్యూహం అనే సినిమాలో నటిస్తున్నాడు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో అజయ్‌ పోలీస్‌ పాత్రలో నటించాడు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్​లో పాల్గొన్న అజయ్ కెరీర్‌ పరంగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పాడు.

‘‘శ్రీహరి హీరోగా విజయన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో నేనొక కీలక పాత్ర పోషించాను. సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాతే రేప్‌ సీన్‌ షూట్‌ అని నాకు చెప్పారు. తీరా, సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు సదరు నటి (ఉత్తరాదికి చెందిన ఓ మోడల్‌) వెంటనే.. ‘డోంట్‌ టచ్‌’ అని కేకలు వేసింది. రేప్‌ సీన్‌ షూట్‌ అని ఆమెకు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ, ఆక్షణం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న ఒక చేదు సంఘటన అదే. కొంతసేపటి తర్వాత ఆ సీన్‌ మొత్తాన్ని రీ రైట్‌ చేసి షూట్‌ చేశారు’’ అని అజయ్‌ వివరించారు. అంతేకాకుండా ఆ తర్వాత తానెప్పుడూ అలాంటి సీన్స్‌లో నటించే ప్రయత్నం చేయలేదని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news