4 వ వివాహానికి సిద్ధమవుతున్న నటుడు నరేష్.. వధువు ఎవరంటే..?

-

ప్రముఖ నిర్మాత , దర్శకురాలు, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ విజయనిర్మల మొదటి భర్త సంతానంగా నరేష్ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నరేష్ ఎప్పుడూ కూడా తల్లి యొక్క ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా.. తన సొంత ప్రతిభతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా సినిమాలలో నటిస్తూ ఇప్పటికే తన కెరీర్ ను కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఒకానొక సమయంలో మా అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికి కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న విషయం తెలిసిందే.Actor VK Naresh With Pavithra Lokesh Visits Mahabaleshwar Temple | Daily Culture - YouTubeఇకపోతే ముగ్గురు భార్యలను వివాహం చేసుకున్నప్పటికీ ఏ ఒక్కరితో కూడా ఈయన జీవించకపోవడం గమనార్హం. ఇప్పుడు ముచ్చటగా నాల్గవసారి ఒక ప్రముఖ నటినీ వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు అనే వార్తలు బాగా వ్యక్తమవుతున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్. ఇకపోతే పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు కూడా ఎన్నో సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల ద్వారా ఈ జంట కి మంచి ఇమేజ్ వుంది. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.Actor VK Naresh With Pavithra Lokesh Visits Mahabaleshwar Temple | TFPC - YouTube

ఇక పవిత్ర లోకేష్ కూడా తన భర్తతో విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నరేష్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ పవిత్ర లోకేష్ తన మొదటి భర్తతో విడాకులు తీసుకోకపోవడం వల్లే నరేష్ ఆమెను రెండో వివాహం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించకపోవడంతో నిజంగానే విడాకులు అనంతరం నరేష్ , పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో మాత్రం ఈ జంటకు మంచి గుర్తింపు ఉంది అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news