నువ్వేం తల్లివమ్మా.. 5 ఏళ్ల కొడుకుని ఇలానా చేసేది..?

-

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికి తన బిడ్డకు చిన్న దెబ్బతగిలినా తల్లడిల్లిపోతుంది. అయితే ఓ తల్లి చేసిన నిర్వాకానికి తల్లుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపించక మానదు. అయితే.. హోం వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి తన ఐదేళ్ల కుమారుడిపై కర్కశంగా వ్యవహరించింది. బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి మిట్టమధ్యాహ్నం ఇంటి మిద్దెపై వదిలేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Parents tie 5-yr-old girl up, leave her on terrace for 'not finishing homework' | Latest News Delhi - Hindustan Times

ఎండవేడిమికి తాళలేక బాలుడు పెడుతున్న ఆర్తనాదాలు నెటిజన్లతో కన్నీళ్లు తెప్పించాయి. బాలుడు ఒకటో తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని టుకుమీర్‌పూర్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది. మిద్దెపై నుంచి బాలుడి ఏడుపులు వినిపిస్తుండడంతో చూసిన పక్కింటి వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కు ట్యాగ్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆ తల్లిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news