’18 పేజీస్‌’ షూటింగ్‌లో బ‌న్నీ కూతురు ర‌చ్చ‌.. వైర‌ల్ వీడియో..!!

-

గ‌త ఏడాది అర్జున్ సురవరం సినిమాతో హిట్టు కోట్టిన యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. కుమారి 21F ఫేం పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న చిత్రం ’18 పేజీస్’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ అందిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మ‌రియు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించ‌బోతున్నారు. ఇంకా సినిమాకి సంబంధించిన నటీనటులను త్వరలో వెల్లడించనున్నారు.

ఈ రోజు ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కి బ‌న్నీ కూతురు అల్లు అర్హ చీఫ్ గెస్ట్‌గా హాజరైంది. ఈ విషయాన్ని నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. మ‌రియు నిఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అర్హ‌కు సంబంధించిన‌ ఓ క్యూట్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో ‘నువ్వు నన్నేం చేస్తావో చూడాలని ఉందట.. ఒక్క సారి చూపించు వాళ్లకి’ అని అల్లు అరవింద్‌ ఆమెను అడగ్గా, తన తాత బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది. ఆ వెంట‌నే అల్లు అర‌వింద్ కూడా అర్హ‌ను ముద్దు పెట్టుకున్నారు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్‌.. ‘ఆమె మా చీఫ్‌ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్‌’ అని వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. కాగా, మెగా హీరోలతోనే కాకుండా వేరే చిన్న హీరోలతో కలిసి సినిమాని నిర్మిస్తూ వరుస హిట్స్ కొడుతుంది జిఏ 2 పిక్చర్స్.. ఇప్పుడు ఈ సినిమాని నిర్మిస్తుండడం సినిమాకి మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news