Sai Dharam Tej: మెగా మేనల్లుడు బ్యాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ !!

-

Sai Dharam Tej: మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ వినాయక చవితి రోజున‌ బైక్‌ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా స్టోర్‌ వైపు వెళ్తుండ‌గా.. ఒక్కసారిగా బైక్‌ పై నుంచి స్కిడ్‌ అయిన కింద ప‌డ్డారు. దీంతో తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే.. స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం నుంచి త‌ప్పించారు. అయితే అనంతరం అపోలో హాస్పిటల్‌లో సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్‌ డిశ్చార్చ్‌ అయ్యారు. ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందారు. ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. సాయి ధరమ్‌ తేజ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చిన స‌మాచారం ప్రకారం.. సాయి ధరమ్‌ తేజ్‌ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా
రాబోతున్న చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. త్వరలోనే మారుతి- సాయి ధ‌ర‌మ్ తేజ కాంబోలోని
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. అయితే యాక్సిడెంట్ తరువాత సాయి తేజ చాలా స‌న్న బ‌డ్డార‌ట‌. ఇక రీసెంట్ గా మెగా హీరోలతో సాయిధరమ్‌ తేజ్‌ తీసుకున్న ఫోటోలో కూడా మనకు అలాగే కనిపిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా వెండి తెర మీద అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్.. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హిట్ కోట్టారు. త‌న‌ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రిపబ్లిక్” అనే సినిమాకి భారీ స్పంద‌న వ‌చ్చింది. కానీ కలెక్షన్ ప‌రంగా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక పోయింది. ఇక మారుతి డైరెక్షన్ లో సాయి సినిమా షూటింగ్ జ‌న‌వరి మొద‌టి వారంలో ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news