కెసిఆర్, బండి ప్రెస్ మీట్ లు.. జబర్దస్త్ ప్రోగ్రాం లెక్క : రేవంత్ రెడ్డి

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. జబర్దస్త్ ప్రోగ్రాం లెక్క సీఎం కెసిఆర్.. బండి సంజయ్‌ ప్రెస్ మీట్ లు ఉంటున్నాయని….బండి సంజయ్.. గుండు ఇద్దరూ కుమ్మక్కు అయ్యారని ఎంపీ అరవింద్‌ పై మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఒక్కటేనని…దళారులు, మిల్లర్ల తో ప్రభుత్వం కుమ్మక్కు అయిందని ఫైర్‌ అయ్యారు.

కేంద్రం తో కెసిఆర్ నిజంగా నే గొడవ పడితే… ఇందిరా పార్క్ లో కెసిఆర్ ధర్నా ఎందుకు చేయలేదు ? అని నిలదీశారు. వడ్లు కొనని… బీజేపీ..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ఫైర్ అయ్యారు. రెండు పార్టీలదే బుద్ది లేని తనమని… జనం రెండు పార్టీలను బండకేసి కొట్టాలని కోరారు. చివరి గింజ వరకు కొంటా అన్నావు… ఇప్పుడేమో గింజ కూడా కొనను అంటున్నారని మండిపడ్డారు. ఎట్లా కొనరో చూస్తామని.. కేంద్రంతో కొట్లాట నిజమే అయితే… కెసిఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌. ఇద్దరు అవగాహన తో ఆడుతున్న వీది నాటకమన్నారు.