నటి కోవై సరళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా పేరు పొందింది కోవై సరళ. ఈమె పుట్టింది తమిళనాడులో అయినా.. తెలుగు సినిమాలలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వనీ వారంటూ ఎవరూ ఉండరు. ఇక వీరిద్దరి టైమింగ్ కి అంత క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమ కెరియర్లో దాదాపుగా 850 పైగా సినిమాలలో నటించింది కోవై సరళ. అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేయడం తగ్గించింది. అందుకు గల కారణం ఏమిటో చూద్దాం.

ప్రస్తుతం ఈమె వయస్సు 60 సంవత్సరాలు కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సరళ స్ట్రైట్ గా సినిమా చేసి దాదాపుగా ఏడు సంవత్సరాల పైన అవుతోంది. అంతేకాకుండా తెలుగు లో ఎటువంటి ప్రోగ్రామ్స్ , అవార్డు ఫంక్షన్ లలో కూడా ఈమె కనిపించడం లేదు. కేవలం ప్రస్తుతం ఈమె అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో మాత్రం సినిమాలు చేయట్లేదు.. అందుకు కారణం ఆమెకు సరైన అవకాశాలు రాలేదనే వార్త వినిపిస్తోంది.

అయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా మళ్లీ తెలుగులో సినిమా అవకాశాలు వస్తే చేస్తారా అనే ప్రశ్న తాజాగా ఈమెకు ఎదురైనట్లు గా తెలుస్తోంది.. కోవై సరళ మాట్లాడుతూ తెలుగు సినిమాలు తప్పకుండా చేస్తాను. కానీ తనకు నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తాను అని తెలియజేసింది. అందుకోసం వెయిట్ చేస్తున్నాం అని కూడా తెలియజేసింది కోవైసరళ. ఏదిఏమైనా ఇంతటి స్టార్ కమెడీయన్ తెలుగు సినిమాలలో కనిపించకపోవడం కాస్త బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు.