నటి పూర్ణకి తన భర్త ఎంత బంగారు పెట్టారో తెలిస్తే షాక్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ పూర్ణ బాగా సుపరిచితమే.. మొదట శ్రీ మహాలక్ష్మి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా అవును, అవును-2, రాజు గారి గది తదితర చిత్రాలలో పూర్ణ తన అంద చందాలతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక తర్వాత బుల్లితెర పైన జడ్జిగా అలరిస్తూ పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఉన్నది. చివరిగా అఖండ చిత్రంతో బాగా ఆకట్టుకుంది పూర్ణ.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే పూర్ణ తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇటీవల తాజాగా పూర్ణ తన భర్త షానిద్ ఆసిఫ్ ఆలీ తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. అయితే దీపావళి పండుగ సందర్భంగా తమ వివాహం అయిపోయింది అని పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది పూర్ణ. అయితే పూర్ణ భర్త జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫౌండర్ సీఈవోగా దుబాయిలో బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం.

అయితే ఈ వివాహం అరబిక్ పద్ధతిలోనే కుటుంబ సభ్యుల మధ్య పెద్దల మధ్య జరిగినట్లు సమాచారం. ఇక పూర్ణకి తన పెళ్లిలో ఆమె భర్త 1800 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చారట . అంతేకాకుండా తన పేరు మీద ఒక లగ్జరీ హౌసింగ్ కూడా నిర్మించి మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి పూర్ణ కోటీశ్వరుని పట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం ఈ విషయం మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news