రోకళ్లు నిలబడటం ఎప్పుడైనా చూశారా?

-

భారత దేశంలో గ్రహణం కనిపించింది..ఢిల్లీలో 4.29 నిమిషాలకి.. హైదరాబాద్‌లో 4 గంటల 59 నిమిషాలకు.. విశాఖలో 5 గంటల 2 నిమిషాలకు, ఏపీలోని విజయవాడలో 4 గంటల 49 నిమిషాలకు, గ్రహణం ప్రారంభమైంది. సోలార్‌ ఎక్లిప్స్‌ని తిలకించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాక్షిక సూర్యగ్రహణాన్ని కొంతమంది బ్లాక్ ఫిల్మ్‌, గాగుల్స్‌ సాయంతో చూసి ఫిదా అయ్యారు. దాదాపు గంటా 45 నిమిషాలపాటు సూర్య గ్రహణం కనువిందు చేసింది.

గ్రహణం ఎఫెక్ట్‌తో నగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జనం బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. గ్రహణం పూర్తయ్యాక శుద్దిస్నానమాచరించారు చాలామంది. ఏడున్నర గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి.గ్రహణం సందర్భంగా నదీ తీరాలకు పోటెత్తారు భక్తులు. పుణ్య స్నానాలు ఆచరించి, గ్రహణ దోష నివారణ పూజలు చేశారు.పాక్షిక సూర్యగ్రహణం మళ్లీ 27 ఏళ్ల తర్వాత ఏర్పడనుంది.అంటే 2032 లో మళ్ళీ సూర్యగ్రహణం ఉండనుంది.

సైన్స్ ఎంతగా దూసుకుపోతున్నా కూడా మూఢనమ్మకాలను పక్కన పెట్టడం లేదు..సూర్యగ్రహణం రోజున ఒక్కో ప్రాంతంలో ఒక్కో వింత ఆచారాలు వెలుగుచూసాయి..ఈ గ్రహణం సమయంలో రోకళ్లు నిలబడతాయా పార్వతీపురం జనాలు అంటున్నారు.గ్రహణం మొదలుకాగానే కంచు గిన్నెలు, ఇత్తడి పళ్లెంలో పసుపు నీళ్లు పోసి రోకళ్లను నిల్చోబెట్టారు..ఆ తర్వాత వాటిని దేవుళ్ళు గా భావించి పూజలు చేశారు.తరతరాల నుంచి వస్తున్న నమ్మకం అని అందుకు తగ్గట్టే గ్రహణం వచ్చే ప్రతిసారి నిజమవుతుందని స్థానికులు చెప్పారు.

గ్రహణం పూర్తయిన తర్వాత రోకళ్లు వాటంతట అవే పడిపోతాయని అన్నారు. వాళ్లు చెప్పినట్టే గ్రహణం ముగిసిన తర్వాత రోకళ్లు పడిపోయాయి. ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్య స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని… మూఢ నమ్మకమని జన విజ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు..ఏది ఏమైనా కూడా ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news