గంగూభాయ్ గెటప్ లో అదరగొట్టేసిన శ్రీముఖి.. ప్రోమో వైరల్..!!

-

బుల్లితెరపై రోజుకొక వినోదాత్మక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా మిస్టర్ అండ్ మిసెస్.ఒకరికి ఒకరు అనే రియాల్టీ షో కూడా మొదలైంది. ఈ కార్యక్రమానికి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోలో నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమవుతున్న ఈ షోకి సంబంధించి తాజాగా నిర్వాహకులు కొత్త ప్రోమో రిలీజ్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో శ్రీముఖి గెటపే ఈ ఎపిసోడ్ కి హైలెట్ అని చెప్పాలి.

మిస్టర్ అండ్ మిసెస్ షో పేరు అయినప్పటికీ వారానికో కొత్త థీమ్ తో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారానికి సంబంధించి ప్రోమో చూసినట్లయితే..అందులో భాగంగా శ్రీముఖి రెగ్యులర్ గా స్టైలిష్ లుక్ లో కాకుండా కొత్త గెటప్ లో సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా హిందీలో అలియా భట్ పోషించిన గంగూ భాయ్ కతియావాడి గెటప్లో దర్శనం ఇచ్చి అందర్నీ అలరించింది శ్రీముఖి. తెల్లటి చీర కట్టుకొని.. నల్ల కళ్లద్దాలు .. నుదిటిపై ఎర్రని బొట్టు ఇలా వేశ ధారణతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రీముఖి గెటప్ చూసి నటుడు శివబాలాజీ ఆమెకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

మరోపక్క శ్రీముఖి ఆహా ఓటీటీ వేదికగా వస్తున్న డాన్సింగ్ ఐకాన్ కార్యక్రమంలో కూడా లీడర్ గా వ్యవహరిస్తోంది . మరోపక్క సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోషూట్లతో యువతను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా బుల్లితెరపై బిజీ యాంకర్ గా మారిపోయింది రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news