అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బుట్ట బొమ్మ సాంగ్..!!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో సంగీత దర్శకుడు తమన్ కెరియర్ సూపర్ గా సాగుతోంది. తన కోసం పెద్ద డైరెక్టర్స్, స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు చిరంజీవి,బాలయ్య కూడా తమన్ ను వదలడం లేదు. ఈ పరిస్థితి గురించి ఒక ఇంటర్వ్యూ లో తాను రోజుకు నాలుగు గంటలు మాత్రమే పడుకొనే అవకాశం వస్తుందని వాపోయాడు.

తాను సంగీతం అందించిన పాటలు అన్ని భాషల్లో చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో పాటలు కూడా  ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఈ చిత్రం లోని బుట్ట బొమ్మ సాంగ్ ఇప్పటికీ హల్చల్ చేస్తూనే వుంది. సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే వుంది. ఇప్పటికి 800 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ గా ఈ బుట్ట బొమ్మ రికార్డ్ సష్టించింది. ఈ సాంగ్ కు 5 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news