నాటి రవివర్మ చిత్రాలకు ప్రాణం పోసిన నేటి నటీమణులు…..ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే….!!

-

18వ శతాబ్దం మధ్యలో జన్మించిన ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు రాజా రవి వర్మ, అప్పట్లో మన దేశంతో పాటు దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక ఆయన వేసిన పెయింటింగ్స్ కు ప్రజలతో పాటు ఎందరో గొప్ప గొప్ప ప్రముఖులు సైతం ముగ్ధులయ్యేవారు అంటే రవి వర్మ చిత్రాల యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు.

కొన్నేళ్ల క్రితం ఆయన మరణించినప్పటికీ, ఆయన వేసిన చిత్రాలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఆయన వేసిన చిత్రాల్లోని ప్రముఖమైన ఒక నాలుగు చిత్రాలను తీసుకుని ఎంతో పేరు గాంచిన వెంకట్ రామ్ అనే ఫొటోగ్రాఫర్, పలువురు సినిమా నటీమణులతో వాటికి జీవకళ తీసుకొచ్చారు.

సీనియర్ నటి రమ్యకృష్ణ, సమంత అక్కినేని, ఐశ్వర్య రాజేష్, శృతి హాసన్ తదితరులు రవివర్మ గీసిన పలు చిత్రాలకు అచ్చం అదే మాదిరి ఆహార్యం, దుస్తులు ధరించి వాటికి జీవం పోశారు. ఇక ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ వాటిని తన కెమెరాలో ఎంతో అందంగా వారి ఫోటోలను బంధించడం జరిగింది.

అయితే ఇదంతా.. ఒక మానవతాదృక్పథం కోసం పుట్టింది. సీనియర్‌ నటీమణి సుహాసినీమణిరత్నం నెలకొల్పిన ‘నామ్‌’ అనే స్వచ్చంద సంస్థ కోసం ఈ ఫోటోషూట్‌ జరిగింది. సమాజంలో అణగారిన మహిళావర్గాలకోసం ఈ సంస్థను సుహాసిని ఏర్పాటు చేసారు. మానవీయ కోణంలో నటీమణులు ఈ ఫోటోషూట్‌కు సహకరించి, తమ మంచితనాన్ని చాటుకున్నారు.

ఇకపోతే కాసేపటి క్రితం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలపై పలువురు ప్రజలతో పాటు కొందరు ప్రముఖులు సైతం అద్భుతం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version