నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో అడవి శేష్ రొమాన్స్… వీడియో లీక్

-

నేచురల్‌ స్టార్‌ నానికి తెలియకుండా ఆయన కార్యాలయంలో షూట్‌ చేసిన ఓ వీడియోను అడివి శేష్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. దీనిని చూసిన నాని.. ‘ఇలా కూడా చేస్తారా?’ అంటూ ట్విటర్‌ వేదికగా శేష్‌ని ప్రశ్నించాడు. ఇంతకీ ఆ వీడియో ఏమిటి?

నాని ప్రారంభించిన ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ బ్యానర్‌పై తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ -2’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ కార్యాలయానికి చేరుకున్న శేష్‌-మీనాక్షి ‘ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ‘‘అవును.. నేను ‘ఉరికే ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశా. ఇలా డ్యాన్స్‌ చేయడం కాస్త సిగ్గుగానే ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తా’’ అంటూ శేష్ వీడియో షేర్‌ చేశాడు. దీనిపై నాని స్పందిస్తూ.. ‘‘నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడొచ్చా?’’ అని ప్రశ్నించాడు.

రెండేళ్ల క్రితం వచ్చిన ‘హిట్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. శైలేశ్‌ కొలను దర్శకుడు. అడివి శేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఇటీవల ఈ సినిమా నుంచి.. ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది.

ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. దీంతో ఈ పాటను పలువురు ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో రీక్రియేట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శేష్‌ – మీనాక్షి సైతం ఈ పాటకు డ్యాన్స్‌ చేసి వీడియో షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news