ఆదిపురుష్ ఈవెంట్‌లో కొట్టుకున్న ఫ్యాన్స్!

-

 

ఘనంగా జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు ఫ్యాన్స్ గొడవపడ్డారు. ముగ్గురు ఫ్యాన్స్ మరో ఫాన్స్ పై దుర్భాషలాడుతూ అతన్ని కొట్టిన వీడియోను నెటిజెన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, గొడవకు గల కారణాలు తెలియట్లేదు. లేడీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఇలా చేశారని మరికొందరు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

కాగా ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ…రామయణం చేస్తున్నావా? అని చిరంజీవి గారు అడిగారు.. అది అదృష్టం అన్నారు. అందరికీ దొరకదు ఆ అదృష్టం.. నీకు దొరికిందని చెప్పారన్నారు హీరో ప్రభాస్‌. ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. కొంచెం మాట్లాడుతా.. సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు.. స్టేజ్‌పై కొంచెం మాట్లాడుతా.. ఎక్కువ సినిమాలు చేస్తానని ప్రకటన చేశారు హీరో ప్రభాస్‌. సినిమా కోసం టీమ్‌ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్‌ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్‌ చేయడం మా అదృష్టం అన్నారు ప్రభాస్‌.

Read more RELATED
Recommended to you

Latest news