బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య.. నిందితుడి కోసం పోలీసుల వేట

-

హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ అనే యువతి బెంగళూరులో అనుమానాస్పద మృతి చెందింది. అర్పిత్ అనే వ్యక్తితో కలిసి ఓ అపార్ట్​మెంట్​లో నివసిస్తున్న ఆకాంక్ష.. మంగళవారం రోజున అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

ఆకాంక్ష, దిల్లీకి చెందిన అర్పిత్‌ గుజ్రాల్ చాన్నాళ్లుగా ప్రేమించుకున్నారని పోలీసులు.. తెలిపారు. ఇద్దరూ కలిసి బెంగళూరులోని కోడిహళ్లిలో…. అద్దె ఇంట్లో ఉండేవారని, ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారని చెప్పారు. అర్పిత్‌కు దూరంగా ఉండాలని ఆకాంక్ష నిర్ణయించుకోవడం.. వారి మధ్య గొడవకు దారితీసినట్లు.. బెంగళూరు నగర డీసీపీ డాక్టర్‌ భీమాశంకర్‌ గుళేద్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఆకాంక్ష మెడకు చున్నీ చుట్టి ఉపిరి ఆడకుండా చేసి హత్యచేశాడని…. వివరించారు. అనంతరం అర్పిత్‌ పారిపోయాడని వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు…….. పోలీసు బృందాలను రంగంలోకి దింపామని డీసీపీ చెప్పారు. ఈ హత్యకేసులో దిల్లీకి చెందిన అర్పిత్‌ గుజ్రాల్ కోసం బెంగళూరు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news