త్వరలో ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్.. ఆనందంలో ప్రభాస్ అభిమానులు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్ ’ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రలో ప్రభాస్ కనిపించగా, ఆయనకు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఈ ఫిల్మ్ వచ్చే నెల 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ సంగతులు అలా ఉంచితే .. ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టారు.

రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను వచ్చే నెల 10న విడుదల చేస్తారని సోషల్ మీడియాలో న్యూ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయమై మూవీ యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నార. ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ ను ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫొటోనే వైరల్ చేస్తున్నారు.

‘ఆదిపురుష్’ ఫిల్మ్‌లో ప్రభాస్ కు జోడీగా ‘సీత’గా కృతిసనన్ నటిస్తుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నదని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్ ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే ప్యారలల్ గా ‘సలార్, ప్రాజెక్ట్ కె’ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో తన 25వ సినిమా ‘స్పిరిట్’ చేస్తు్న్నారు ప్రభాస్.