అదితి రావు హైదరి తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఈ భామ మేకప్ లేకపోయినా అందంగా మెరిసిపోతూ కనిపిస్తారు అయితే ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించగా తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
టాలీవుడ్ హీరోయిన్ తన అందం వెనుక ఉన్న సీక్రెట్స్ చెప్పుకొచ్చింది. ఇంట్లో దొరికే పదార్థాలతోనే అందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చిన అదితి సీజన్ బట్టి తన బ్యూటీ సీక్రెట్స్ మారుతూ ఉంటాయని తెలిపింది. “ముఖం శుభ్రం చేసుకోవడానికి నేను సబ్బు అస్సలు వాడను. ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన పౌడర్లు, కషాయాలు ఉపయోగిస్తా. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత పచ్చి పాలు, ఓట్స్‌తో తయారుచేసిన మిశ్రమంతో ముఖం శుభ్రం చేసుకోవడం నాకు అలవాటు. ఆపై టోనర్ రాసుకోవడం మర్చిపోను. ఇక ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా సన్‌స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకుంటా. ఇక పడుకునే ముందు, మేకప్ తీశాక గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేసుకొని ఐ క్రీమ్, నైట్ క్రీమ్ రాసుకుంటా. వృత్తిలో భాగంగా మేకప్ వేసుకోవాల్సి ఉండటం తప్పనిసరి కాబట్టి ఆ ప్రభావం శరీరం మీద పడకుండా మేకప్ వేసుకున్నాక తప్పకుండా తొలగిస్తా అలాగే షూటింగ్ సమయంలో మేకప్ దూరంగా ఉంటూ వాటిలోని రసాయనాల ప్రభావం శరీరం మీద పడకుండా చర్మం పొడి మారకుండా నీటిని ఎక్కువగా తీసుకుంటా.. అలాగే పండ్లు, కాయగూరలు ఆహారంలో భాగం చేసుకుంటూ ఫేస్ ఆయిల్స్ కూడా ఎక్కువగా వాడుతుంటా. ఇవి చర్మానికి తేమనందించడమే కాదు.. మేకప్ వల్ల చర్మం పొడిబారకుండా, వయసు పైబడిన ఛాయలు కనిపించకుండా చేస్తుంది.. ” అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే రోజు కచ్చితంగా బుల్లెట్ కాఫీ తీసుకుంటానని, విటమిన్ సి ఎక్కువగా ఉండే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చర్మం మెరుపులు సంతరించుకుంటుందని తెలిపింది. రోజు కచ్చితంగా కాస్త సమయం వ్యాయామానికి కేటాయిస్తానని, యోగ ధ్యానం వంటివి ప్రశాంతంగా ఉంచుతాయని తెలిపింది. రోజు ఉదయాన్నే ఆయిల్ పూలింగ్ చేస్తానని సహజసిద్ధమైన నూనెతో నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు మెరుస్తాయని చెప్పుకొచ్చింది. అలాగే ఒత్తుగా వుండే కనుబొమ్మలు తన మొహానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకొచ్చిన ఈ భామ జుట్టు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపింది. కచ్చితంగా తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటానని రకరకాల హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడం వల్ల జుట్టు ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉంటానని తెలిపింది.