గెలిచే సీటులో కాంగ్రెస్ రచ్చ..పంచాయితీ అదే!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలోనే కాదు..నియోజకవర్గ స్థాయిలో కూడా నేతల మధ్య రచ్చ జరుగుతుంది. చాలా చోట్ల సీట్ల విషయంలో పంచాయితీ నడుస్తోంది.ఈ పంచాయితీ వల్ల గెలిచే సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది. అలా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న సీట్లలో రచ్చ జరుగుతుంది వచ్చి….ఇబ్రహీంపట్నంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరిగింది.

అయితే ఇక్కడ్ కాంగ్రెస్ జెండా ఎగిరి ఏళ్ళు గడుస్తున్నాయి. ఎప్పుడో 1983లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత నుంచి టి‌డి‌పి, సి‌పి‌ఐ పార్టీలు గెలుస్తూ వచ్చాయి. ఇక 2009, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి..ఆ తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళి 2018 ఎన్నికల్లో దాదాపు ఓటమి వరకు వెళ్ళి గెలిచారు. ఎందుకంటే ప్రతి రౌండ్లో వెనుకబడుతు వచ్చి..చివరికి 376 ఓట్లతో గెలిచి బయటపడ్డారు.

కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో బి‌ఎస్‌పి నుంచి పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఓడిపోయారు. అయితే టి‌డి‌పితో పొత్తు వల్ల..ఈ సీటు టి‌డి‌పికి ఇచ్చారు కానీ..కాంగ్రెస్ సపోర్ట్ రంగారెడ్డికే ఉంది. కాకపోతే టి‌డి‌పికి 18 వేల ఓట్ల వరకు పడటంతో ఓట్లు చీలడంతో మంచిరెడ్డి గెలిచారు. రంగారెడ్డి ఓడిపోయారు.

ఆ తర్వాత రంగారెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చి ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నారు..పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు..అటు మంచిరెడ్డిపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ రంగారెడ్డి గెలుపు ఫిక్స్ అనే తరుణంలో..ఇబ్రహీంపట్నం సీటు తనకే దక్కుతుందని మర్రి నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు.

దీంతో రంగారెడ్డి, నిరంజన్ రెడ్డిల మధ్య కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది..కలిసి పనిచేస్తే ఇబ్రహీంపట్నంలో గెలుస్తారు…లేదంటే అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Latest news