సినిమా ఫ్లాప్ అని తెలిశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా ..?

-

కరోనా దెబ్బకి సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులన్ని ఎవరూ ఊహించనంతగా మారిపోయాయి. కొత్తగా మొదలవ్వాల్సిన సినిమాల విషయం అలా ఉంచితే ఇప్పటికే మొదలు పెట్టినవి.. ఒకటి రెండు డ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నవి…అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ల్యాబ్ కే పరిమితమైనవి అన్ని భాషల్లో కలిపి దాదాపు వంద సినిమాలకి పైనే ఉన్నాయట. ఈ సినిమాలలో 4-5 కోట్లతో నిర్మించిన సినిమాల దగ్గర్నుంచి 400 కోట్ల తో పాన్ ఇండియా సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ వరకు చాలా సినిమాలున్నాయి.

 

అయితే ఇంకా ఎంతకాలం కంప్లీట్ అయిన సినిమాలని ల్యాబ్ లోనే పెట్టుకోవాలి అన్న ఉద్దేశ్యంతో కొంతమంది నిర్మాతలు ఒక్కొక్కరు తమ సినిమాలని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు తెలుగు తమిళం హిందీ భాషలు కలిపి 10 సినిమాలకి పైగానే ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలలో బాలీవుడ్ సినిమాలు ..ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ హీరోలుగా రూపొందిన సినిమాలు ఉండటం ఆశ్చర్యకరం. ఇక అక్షయ్ కుమార్ సినిమాకి ఏకంగా 120 కోట్ల కి అమ్ముడు పోయిందన్న వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి చూస్తే ఫ్లాప్ అవుతుందేమో …భారీ లాభాలు రావేమో అన్న అనుమానం కలిగిన సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు ఉదాహరణ కూడా ఇటీవల రిలీజైన జ్యోతిక పోన్మగల్ వందాల్, ..కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాలు. ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. కాని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అంతేకాదు తెలుగులో వచ్చిన ఒక సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీన్ని బట్టే జనాలు ఫ్లాప్ సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news