టాలీవుడ్ కు డ్రగ్స్ టెన్షన్.. కాసేపట్లో కోర్టు ముందుకు నటి ?

టాలీవుడ్‌ ను డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. నిన్న ముంబైలోని ఓ హోటల్‌లో డ్రగ్స్‌ సప్లయర్‌ తో టాలీవుడ్‌ నటి పట్టు బడింది. కాసేపట్లో ముంబై కోర్టులో హీరోయిన్‌ ను ఎన్సీబీ ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ చాంద్‌, డ్రగ్‌ పెడ్లర్‌ సయ్యద్‌తో టాలీవుడ్‌ హీరోయిన్‌కు ఉన్న సంబంధాలపై ఎన్సీబీ ఆరా తీస్తోంది. నాలుగు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ గా ఆమె నటించినట్టు చెబుతున్నారు.

కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేదాని మీద మాత్రం ఎలాంటి లీకులు అందడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌ నటిని ఎన్సీబీ కార్యాలయంలో ఉంచిన అధికారులు ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నారు. టాలీవుడ్‌ నటితో సంబంధం ఉన్న మిగతావారిపై కూడా ఎన్సీబీ ఆరా తీస్తున్న క్రమంలో టాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఇక నిన్న హోటల్ లో రైడ్ చేసిన క్రమంలో ఏకంగా 400 గ్రాముల డ్రగ్స్ ని కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంది.