అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతో యూత్ లో ఓ స్టార్ హీరోకి ఈక్వల్ గా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఓవర్సీస్ లో కూడా ముందురోజు నుండి ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు యూఎస్ లో 146 సెంటర్స్ లో రిలీజ్ అయిన గీతా గోవిందం కేవలం ప్రీమియర్స్ తోనే 4,00,000 డాలర్స్ వసూళు చేసింది. ఈ లెక్కన చూస్తే విజయ్ గీతా గోవిందం యూఎస్ లో 1 మిలియన్ కలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదని చెప్పొచ్చు.
ఓవర్సీస్ లో విజయ్ దమ్ము చూపించేలా గీతా గోవిందం కలక్షన్స్ ఉన్నాయి. ఇక సినిమాకు యునానిమస్ హిట్ టాక్ రావడంతో ఈ నాలుగు రోజుల కలక్షన్స్ ను ఆపడం ఎవరి వల్లా కాదు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా విజయ్ కెరియర్ లో మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.