ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టీజర్

-

నవీన్ పోలిశెట్టి, శృతి వర్మ జంటగా నటిస్తున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. స్వరూప్ ఆర్.ఎస్.జే డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రాహుల్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. టీజర్ చూస్తే హీరో ఓ డిటెక్టివ్ గా కనిపిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది.

తెలుగులో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వస్తున్న నవీన్ మొదటిసారి హీరోగా చేస్తున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. టైటిల్ కాస్త పెద్దగా ఉన్నా ప్రేక్షకులను మెప్పించే టీజర్ తో సినిమాపై ఆసక్తి పెంచారు. టీజర్ సినిమా కంటెంట్ తెలియచేస్తుండగా తప్పకుండా ఇదో మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news