టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంట చైసామ్ గోవాలో మస్తు ఎంజాయ్ చేశారట. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది.. వాళ్లు ఎంత ఎంజాయ్ చేశారో అని. ఇంతకీ అకేషన్ ఏంటి అంటారా? శుక్రవారం(నవంబర్ 23) నాగ చైతన్య బర్త్ డే కదా. అదే అకేషన్. దీంతో చైసామ్ గోవా చెక్కేశారు. అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. నాగచైతన్య తదుపరి సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయింది. సినిమా పేరు మజిలీ. ఈ సినిమాలో చైసామ్ ఇద్దరు జంటగా నటిస్తున్నారు. చై బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ కు ట్రీట్ కూడా ఇచ్చాడట. గోవాలో ఇచ్చిన ఈ ట్రీట్ లోనే చైసామ్ ఎంజాయ్ చేశారు. అనంతరం చైసామ్ సెపరేట్ గా గోవాలో బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు.