సాధారణంగా ఉండాల్సిన అవయవాల కంటే ఎక్కువ అవయవాలు, తక్కువ అవయవాలతో పిల్లలు జన్మించడం సహజం. కానీ.. మూడు చేతులతో జన్మించడం అనేది చాలా అరుదు. కానీ.. ఓ చిన్నారి మూడు చేతులతో జన్మించింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లా తఖత్ పూర్ లో చోటు చేసుకున్నది. తఖత్ పూర్ కు చెందిన సాధిక ఈ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కన గ్రామాల ప్రజలు ఆ చిన్నారిని చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఈ అరుదైన జననంపై స్పందించిన డాక్టర్లు పది లక్షల మందిలో ఒకరు ఇలా పుడతారని తెలిపారు. అయితే.. పాప ఆరోగ్యం బాగుందని.. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవన్నారు. ఈ అరుదైన చిన్నారిని ప్రస్తుతం బిలాస్ పూర్ లోని ఛత్తీస్ గఢ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఈ చిన్నారికి ఉన్న అదనపు చేయిని ఆపరేషన్ చేసి తీయొచ్చని.. దాని వల్ల పాపకు ఎటువంటి సమస్యలు రావని వాళ్లు పేర్కొన్నారు. కాకపోతే.. ఈ చిన్నారి కొంచెం పెద్దయ్యాక… 15 ఏళ్ల లోపు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు.