త‌మ‌న్నా కోసం మ‌రో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా.. ఈ సారైనా సక్సెస్ అవుతుందా!

తెలుగు ప్రేక్ష‌కులను బాగా మెస్మ‌రైజ్ చేసిన అందం ఆమెది. అందుకే అంద‌రూ ఆమెను మిల్కీ బ్యూటీ అని బిరుదు ఇచ్చేశారు. ద‌శాబ్ద కాలంగా టాలీవుడ్ లో ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌కుండా దూసుకుపోతోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో మీకు ఇప్ప‌టికే గుర్తుకు వ‌చ్చి ఉంటుంది. ఎందుకంటే మిల్కీ బ్యూటీ అంటే తెలియ‌ని వారు ఉంటారా. అవునండి ఇప్పుడు ఆమె గురించే మాట్లాడేది. అయినా ఆమె గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనుకోండి. ఇప్పుడు ఓ విష‌యం మీకు చెప్పాలి.

ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో సినిమాలు చూడ‌టం త‌గ్గించారు. కార‌ణం కొవిడ్‌. దాని దెబ్బ‌కు థియేట‌ర్ల‌కు వ‌చ్చే వారే క‌రువ‌య్యారు. దాదాపు ఏడాది కాలంగా సినిమాలు కోలుకోలేని దెబ్బ తిన్నాయి. వాయిదాల మీద వాయిదాలు వేయ‌డంతో బిజినెస్ దెబ్బ తింటోంది. దీంతో ఆహా లాంటి ఓటీటీలు తెర మీద‌కు వ‌చ్చింది. సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేయ‌డం మొద‌లైంది. అయితే ఆహా కోసం త‌మ‌న్నా క‌లిసి ప‌నిచేస్తోంది.

తాజాగా తమన్నాతో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ నిర్మించింది ఆహా సంస్థ‌. ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నా.. సిరీస్ మాత్రం పెద్ద‌గా ఆడ‌లేదు. త‌మ‌న్నా కోసం మాత్ర‌మే ఈ వెబ్ సిరీస్ ను చూడొచ్చు. ఆహా ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన వాటిలో ఇదే పెద్ద బ‌డ్జెట్ సిరీస్‌. ఇక రిజ‌ల్ట్ ఎలా ఉన్నా.. ఆహా బృందం పాజిటివ్ గానే ఉంది. తమన్నాతో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది. స‌మంత చేస్తున్న సామ్ జామ్ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. కాబ‌ట్టి త‌మ‌న్నాతో కూడా ఏదైనా టాక్ షో చేయాల‌ని చూస్తోంద‌ట సంస్థ‌. చూడాలి మ‌రి మిల్కీ బ్యూటీ వెబ్ సిరీస్ తో వ‌స్తుందా లేక టాక్ షోతో వ‌స్తుందా అని.