జాతీయ గీతం వినపడగానే.. భావోద్వేగానికి గురైన ఐశ్వర్యారాయ్!

-

ఐశ్వర్యారాయ్ బచ్చన్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు. అభిషేక్ తో పెళ్లి తర్వాత అడపాదడపా హిందీ సినిమాలు చేస్తున్నది ఐశ్వర్య. అయితే.. ప్రస్తుతం ఐశ్వర్యకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ముంబైలో ఐఎంసీ డబ్ల్యూ ఎగ్జిబిషన్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది.

అక్కడ జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఐశ్వర్య కంటతడి పెట్టుకున్నది. ఆసమయంలో ఆమె పక్కన షబానా అజ్మీ కూడా ఉన్నారు. ఇక.. ఈ వీడియోను బాలీవుడ్ ఫ్యాన్స్ అకౌంట్ లో షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐశ్వర్య ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ సినిమా గులాబ్ జమాన్ లో నటిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news