బాలీవుడ్ పైన మ‌క్కువ చూపుతున్న చిరు

-

కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో తనదైన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతున్న చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి నుండి ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో సందిగ్ధత నడుస్తోంది. తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకున్న కొరటాల ఈసారి బలంగా మార్పు కోరుకుంటున్నారట.

అంతేకాదు చిరు సైతం బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ ఇద్దరు ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, జీరో’ సినిమాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఆకట్టుకున్నారు. వీరైతే తమ సినిమాకు బాగుంటుందని చిరు భావిస్తున్నారట. ఇప్పటికే చర్చలు మొదలయ్యాయ‌ని, త్వరలో ఫైనల్ క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిష నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచరాం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారినపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news