ఆకాష్ పూరి ఎమోషనల్ స్పీచ్.. నేను తలుచుకుంటే “లైగర్” చేయొచ్చు..

-

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చోర్ బజార్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకాష్ పూరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం పై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నెపోకిడ్ ని మహా అయితే హీరోగా లాంచ్ చేయగలరు కానీ.. సక్సెస్ చేయలేరు అని అన్నాడు ఆకాష్.

టాలెంట్ ఉంటేనే వాడు సక్సెస్ అవుతాడు తప్ప స్టార్ డైరెక్టర్ కొడుకు అయినంతమాత్రాన సక్సెస్ రాదు అంటూ స్పీచ్ ఇచ్చారు. కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు ఎందుకు బయట వాళ్ళతో సినిమా చేయడం.. మీ నాన్నతోనే చేయొచ్చు కదా అని అంటుంటారు. కానీ నెపోటిజాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకోవాలంటే.. నాన్న ఆ లైగర్ సినిమా నాతోనే తియ్యి అని అడిగేవాడిని.. నేను అడిగితే మా నాన్న తప్పకుండా చేస్తారు. కానీ నాకు వద్దు అని అన్నారు. నేను కష్టపడి మా నాన్న స్టేజి వరకు వెళ్లిన తర్వాతే ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news