ఎట్టకేలకు అనౌన్స్ మెంట్ కాబోతున్న అఖిల్ అక్కినేని ఎజెంట్ రిలీజ్ డేట్.!

-

హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్  ను ఖచ్చితం గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా  ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.సాదారణంగా పెద్ద హీరోల తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల చేయటానికి ఆసక్తి చూపరు. ఆ రెండు నెలలు  పరీక్షలు ముందు వస్తాయి కాబట్టి అందుకే పెద్ద సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదల  కావు. అది పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటికే బడ్జెట్ పెరిగి వడ్డీలు కట్టలేక వేసవి కాలం కంటే ముందే కచ్ఛితంగా  విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news