పూజా హెగ్డే కోసం లావెక్కిన అఖిల్ మరి పెద్దవాడిగా కనిపించాలి కదా ..!

-

అఖిల్ అక్కినేని ప్రస్తుతం కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. కానీ ఆ మూడు సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ఞు ..సినిమాలు తన ఏజ్ కి తగ్గట్టుగా మంచి లవ్ స్టోరీస్ తెరకెక్కాయి. కాని ప్రేక్షకులను ఆకట్టుకోలేక ఈ మూడు సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. అయితే అఖిల్ ఇప్పుడు మాత్రం చాలా నమ్మకంగా తన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మీద ఉన్నాడట.

 

 

ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ శరవేగంగా అన్నీ కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. అఖిల్.. పూజా హెగ్డే ల ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మార్చ్ రెండో వారం నుంచి ప్రమోషన్స్ లో జోరు పెంచాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈమధ్య అఖిల్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు. అఖిల్ ఈ ఫోటోలో కాస్త వెయిట్ పెరిగినట్టు కనిపిస్తున్నాడు. అయితే ఇలా లావుగా తయారవడానికి హీరోయిన్ పూజా హెగ్డే అని తెలుస్తోంది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా కాస్త వెయిట్ పెరిగాడని అంటున్నారు. అంతేకాదు అఖిల్ సరసన పూజా హెగ్డే కాబట్టి తనకి తగ్గటే కనిపించాలని కాస్త వేయిట్ గేయిన్ చేశాడట అఖిల్. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత అందిస్తుండగా జీఎ 2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అఖిల్ గత మూడు సినిమాలు ఫ్లాపయిన నేపథ్యంలో ఒకవైపు మేకర్స్ మరో వైపు నాగార్జున ఎడింగ్ దగ్గర్నుంచి ప్రమోషన్స్ వరకు అన్నీ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి ఈ సినిమా అయినా అక్కినేని అఖిల్ కి హిట్ ఇచ్చి కాస్త క్రేజ్ తీసుకు వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news