తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బ భయంకరంగా తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విడిపోయాక తెలంగాణలో పట్టు కోల్పోవడం జరిగింది. అయితే ఆంధ్రా లో బలంగా ఉంది అని అనుకున్న తరుణంలో 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. టిడిపి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రజలు 2019 రిజల్ట్ ఇచ్చినట్లు వార్తలు రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీని నడిపించడానికి అనేక అవస్థలు పడుతున్నారు. దాదాపు జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు తెలుగుదేశం పార్టీ మరికొద్ది రోజుల్లో ఏపీలో కనుమరుగవడం ఖాయమని వార్తలు మొన్నటి వరకు రావడం జరిగాయి. ఇటువంటి తరుణంలో ఎవరూ ఊహించని రీతిలో టీడీపీకి భారీ పాజిటివ్ న్యూస్ అంటూ ఒకటి సోషల్ మీడియా, ఏపీ మీడియా వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. ఏమిటంటే గత 2014 ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా గుర్తించడం జరిగింది. ఆ టైంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందింది.
దీంతో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మాత్రం కృష్ణాజిల్లాలో చాలా బలంగా ఉంది. స్టేట్ అంతా జగన్ గాలి వీచిన గాని కృష్ణా జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు. అయితే తాజాగా ఇటీవల ఓ మీడియా ఛానల్ కృష్ణాజిల్లా పరిసర జిల్లాలలో అమరావతి ప్రభావం ఏవిధంగా ఉంది అని సర్వే చేయించగా కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు మరియు గోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నట్లు జగన్ ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రకటించడం జరిగిందో అప్పుడు టిడిపి పుంజుకున్నట్లు సర్వేలో తేలింది. దీంతో ఇది ఖచ్చితంగా టీడీపీకి పాజిటివ్ న్యూస్ అని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.