మిస్టర్ మజ్ను సింగిల్ కట్ లేదట

అక్కినేని అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 25న రిలీజ్ అవనున్న మిస్టర్ మజ్ను ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర దర్శకుడు వెంకీని ప్రశంసించినట్టు తెలుస్తుంది. అంతేకాదు సింగిల్ కట్ కూడా లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట.

వెంకీ అట్లూరి మొదటి సినిమా తొలిప్రేమ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన వెంకీ అట్లూరి రెండో సినిమాగా మిస్టర్ మజ్ను వస్తుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ హిట్ అయ్యాయి. మరి మిస్టర్ మజ్ను అయినా అఖిల్ కెరియర్ లో హిట్ ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి.