తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో సుమారు 75 శాతం తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తొలి విడతలో 4,470 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 769 గ్రామాలు ఏకగ్రీవం అవ్వగా.. మిగిలిన 3,701 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటిల్లో 2440 గ్రామాల్లో తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. కొన్ని స్థానాల్లో 669 మంది స్వతంత్య్ర అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అయితే గెలిచిన వారితో ఆయా గ్రామ పంచాయతీల్లో విజయోత్సవ ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి.