ఆరెంజ్ సినిమా గుర్తుచేస్తున్న మజ్ను

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జనవరి 25న రిలీజ్ అవనుంది. శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అవగా ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూశాక ఇది రాం చరణ్ ఆరెంజ్ సినిమాకు కొనసాగింపుగా ఉందని అంటున్నారు. ఆరెంజ్ సినిమాలో జీవితాంతం ప్రేమించే వ్యక్తి ఉండడని.. బొమ్మరిల్లు భాకర్ తన స్టైల్ లో చెప్పాడు. అయితే అది జనాలకు ఎక్కలేదు. సేమ్ స్టోరీ ఫ్లాట్ తో ఇప్పుడు అఖిల్ మిస్టర్ మజ్ను వస్తుదని తెలుస్తుంది. అయితే ఆరెంజ్ లో హీరో ప్లే బోయ్ కాదు కాని మిస్టర్ మజ్నులో మాత్రం అఖిల్ ప్లే బోయ్ గా చేస్తున్నాడు. ట్రైలర్ కాస్త అటు ఇటుగా ఆరెంజ్ ఫ్లేవర్ కనిపిస్తున్నా సినిమా తప్పకుండా వెంకీ డిఫరెంట్ గా ట్రీట్ చేసి ఉంటాడని చెబుతున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.